మందకృష్ణతో ఆ ఒక్క విషయంలో నాకు బాధ: సీఎం రేవంత్ 1 y ago
TG: MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో విభేదాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. మందకృష్ణతో తనకు ఎలాంటి విభేదాలు లేవు అని స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత అనుబంధం బాగుందని తెలిపారు. కానీ.. ఒక విషయంలో బాధగా ఉందన్నారు. తన కంటే ఎక్కువ ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని మందకృష్ణ ఎక్కువగా నమ్ముతున్నారన్నారు. దేశంలో BJP పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు.